Vikarabad: ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ ఎస్పీ!
Vikarabad: బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా ముస్లింలకు ఎస్పీ కే. స్నేహ మెహ్రా ఐపీఎస్ శుభాకాంక్షలు తెలిపారు.
Vikarabad: ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ ఎస్పీ!
Vikarabad: బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ జిల్లాలోని ముస్లిం సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనలు సజావుగా సాగేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పండుగ రోజున ఈద్గాలు, మసీదుల వద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.
వాహనదారులు పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తి లేదా వస్తువును గమనించినా, లేదా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలాంటి సమాచారం ఏదైనా తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని లేదా డయల్ 100ని సంప్రదించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




