Vikarabad: సీఎం పర్యటన బందోబస్తుపై ఎస్పీ స్నేహ మెహ్రా బ్రీఫింగ్!
Vikarabad: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
Vikarabad: సీఎం పర్యటన బందోబస్తుపై ఎస్పీ స్నేహ మెహ్రా బ్రీఫింగ్!
వికారాబాద్: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటన సందర్బంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించి బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి పర్యటన అత్యంత కీలకమైనదని, ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా సమయపాలన, క్రమశిక్షణ పాటించాలన్నారు. వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రూట్ బందోబస్తు, సభా ప్రాంగణ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. విధుల్లో ఉన్న సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడం మనందరి బాధ్యత. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి అని జిల్లా ఎస్పీ గారు సిబ్బందికి సూచించారు. ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, IPS గారు, సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి గారు, ఇతర అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది.




