Vikarabad: పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించిన ఎస్పీ

Vikarabad: వికారాబాద్ జిల్లాలో సుదీర్ఘ సేవలుందించి రిటైర్ అయిన నలుగురు పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించిన ఎస్పీ స్నేహ మెహ్రా, IPS. బెనిఫిట్స్ చెక్కుల పంపిణీ.

MOGULAIAH, VIKARABAD
Published on: 1 Aug 2026 6:33 AM IST
Vikarabad
X

Vikarabad: పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించిన ఎస్పీ

వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించి, నేడు పదవీ విరమణ పొందుతున్న నలుగురు అధికారులను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

పదవీ విరమణ పొందిన అధికారులు శ్రీ బి. చంద్రయ్య (SIP-5913), చెంగోముల్ పోలీస్ స్టేషన్ (37 ఏళ్ల సేవ), శ్రీ మొహమ్మద్ అబ్దుల్ గఫార్ (SIP-1804), DCRB (42 ఏళ్ల సుదీర్ఘ సేవ),శ్రీ బి. చంద్రశేఖర్ (ASIP-894), బషీరాబాద్ పోలీస్ స్టేషన్ (34 ఏళ్ల సేవ), శ్రీ జి.ఎం. ఇర్షాద్ అలీ (PC-2136), నవాబ్‌పేట పోలీస్ స్టేషన్ (39 ఏళ్ల సేవ).

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ పదవీ విరమణ పొందుతున్న అధికారులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.

వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో చేరిన నాటి నుండి పదవీ విరమణ పొందే వరకు వారు అందించిన నిస్వార్థ సేవలను కొనియాడారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో వారు పోషించిన పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలు మరియు అనుభవం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

అనంతరం ఎస్పీ అధికారులకు వారి పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన చెక్కులను (Retirement Benefits) అందజేశారు. వారి పదవీ విరమణ అనంతర జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

అలాగే, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పోలీస్ ఉద్యోగం అత్యంత బాధ్యతతో పాటు ఒత్తిడితో కూడుకున్నదని, అలాంటి పరిస్థితుల్లో విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, IPS DCRB DSP జానయ్య, DSB ఇన్స్పెక్టర్ నాగార్జున, జిల్లా పోలీస్ ప్రసిడెంట్ అశోక్, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story