Vikarabad: వికారాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో బెల్ ఆఫ్ ఆర్మ్స్ తనిఖీ చేసిన ఎస్పీ
Vikarabad: వికారాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్ను పరిశీలించిన ఎస్పీ స్నేహ మెహ్రా. ఆయుధాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై అధికారులకు పలు ఆదేశాలు.
Vikarabad: వికారాబాద్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో బెల్ ఆఫ్ ఆర్మ్స్ తనిఖీ చేసిన ఎస్పీ
వికారాబాద్: వికారాబాద్ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ వార్షిక తనిఖీలలో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారు ఈరోజు వికారాబాద్ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్ (Bell of Arms) ను సందర్శించి, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మ్యాగజైన్ గది మరియు సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయుధాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఆయుధాల జారీ మరియు స్వీకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. స్టాక్ లెడ్జర్, వీక్లీ క్లీనింగ్ రిజిస్టర్, అధికారులు మరియు పీఎస్ఓలకు ఆయుధాల జారీ రిజిస్టర్, జారీ మరియు స్వీకరణ వోచర్లు, గత తనిఖీల రికార్డులు, వార్షిక ఆయుధ తనిఖీ ఈ-05 బుక్, బేస్ రిపేర్ వర్క్‌షాప్ బుక్, మందుగుండు సామగ్రి స్టాక్ లెడ్జర్ తదితర రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం మ్యాగజైన్ గదిని సందర్శించి, అక్కడ భద్రపరిచిన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి వివరాలను పరిశీలించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రపరిచే విధానం, వాటి నిర్వహణతో పాటు సంబంధిత రికార్డుల క్రమబద్ధతను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ఆయుధాలు, మందుగుండు సామగ్రి భద్రత విషయంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. ఆయుధాలను నిబంధనల ప్రకారం భద్రపరచడంతో పాటు, వాటి శుభ్రత మరియు నిర్వహణపై నిరంతరం దృష్టి సారించాలని తెలిపారు. ఆయుధాల జారీ, స్వీకరణకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఆయుధాల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో వికారాబాద్ AR డీఎస్పీ యు. వీరేష్, ఆర్ఐలు పి. నాగరాజు, ఎం. శ్రీశైలం గౌడ్, కె. అశోక్, ఆర్ఎస్ఐలు రాము, బాలాజీ నాయక్‌లతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




