Vikarabad: వికారాబాద్‌లో డీసీఆర్‌బీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ
Vikarabad: వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని డీసీఆర్‌బీని ఆకస్మికంగా పరిశీలించిన ఎస్పీ స్నేహ మెహ్రా. కేసుల రికార్డుల నిర్వహణపై అధికారులకు ఆదేశాలు.
Vikarabad: వికారాబాద్‌లో డీసీఆర్‌బీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ
వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB)ను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, లిప్స్ వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారు నేడు జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB) కార్యాలయాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కేసుల రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల వివరాలు, నేర గణాంకాల నిర్వహణ, *CCTNS*లో కేసుల నమోదు విధానం, రికార్డుల భద్రపరిచే విధానం, డిజిటల్ డేటా భద్రత, కార్యాలయ పరిపాలనతో పాటు ఇతర సంబంధిత అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని, కేసుల దర్యాప్తుకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందుబాటులో ఉంచేందుకు సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
అలాగే ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు రికార్డుల నిర్వహణలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ పరిశీలనలో డీసీఆర్‌బీ డీఎస్పీ జనయ్య, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ నాగార్జున, సంబంధిత అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




