Vikarabad: ఎస్పీ కార్యాలయంలో వినాయక పూజల్లో పాల్గొన్న ఎస్పీ స్నేహ మెహ్రా

Vikarabad: వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్.

MOGULAIAH, VIKARABAD
Published on: 14 Sept 2026 10:30 PM IST
Vikarabad
X

Vikarabad: ఎస్పీ కార్యాలయంలో వినాయక పూజల్లో పాల్గొన్న ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద సోమవారం జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ వినాయకుని ఆశీస్సులు కలగాలని ప్రార్థించారు.

వినాయక చవితి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. పండుగను సమన్వయంతో, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఐపీఎస్, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, వికారాబాద్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్, ఆర్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD