Vikarabad: రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్
Vikarabad: తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష.
Vikarabad: రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్
వికారాబాద్: తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాష్ట్ర శాసనసభ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలిపారు. బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని, ఇది మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రకృతి పండుగ అని అన్నారు.
మన పెద్దలు మనకు అందించిన ఈ గొప్ప సంప్రదాయాన్ని, సంస్కృతిని, జీవన విధానాన్ని మనమందరం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు.
ఈ పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, మన ఆడబిడ్డలు, రైతన్నలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం ఎటువంటి ప్రకృతి విపత్తులనైనా ఎదుర్కొనే శక్తిని అమ్మవారు ప్రజా ప్రభుత్వానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.




