Vikarabad: దుర్గామాత మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్!
Vikarabad: వికారాబాద్ పట్టణంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
Vikarabad: దుర్గామాత మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్!
Vikarabad: శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలో పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి మండపాలను తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సందర్శించారు.
ఈ సందర్భంగా మండపాల్లోని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. విశ్వం పంతులు ఆహ్వానం మేరకు శివాజీనగర్ కాలనీలోని అమ్మవారి అఖండ హారతి పూజా కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు .
పూజారులు అమ్మవారి తీర్థప్రసాదాలను స్పీకర్ ప్రసాద్ కుమార్ కి అందించి ఆశీర్వదించారు. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కాలనీలో కౌన్సిలర్ మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో త్రిశూల్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలోనూ స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ప్రార్థించానని స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు తెలిపారు.
ప్రకృతి విపత్తు ఎల్ నినోను ఎదుర్కొనే శక్తిని రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందించాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు. రానున్న రోజుల్లో వికారాబాద్ పట్టణంతో పాటు వికారాబాద్ నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంట పూజా కార్యక్రమాల్లో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ చిగుర్లపల్లి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుష్పలత, కౌన్సిలర్లు లక్ష్మీకాంత్ రెడ్డి, రాఘవేందర్, స్థానిక కౌన్సిలర్ సుచరిత చరణ్ రెడ్డి, వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, సామా ప్రభాకర్ రెడ్డి, డీఎస్పీ ఆంజనేయులు, స్థానికులు, యూత్ కాంగ్రెస్ నాయకులు చింటు, సతీష్ రెడ్డి, నిఖిల్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




