Vikarabad: వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్!

Vikarabad: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాల మేరకు 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించి 1,019 వాహనాలను తనిఖీ చేశారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 28 Nov 2026 2:39 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్!

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు భారీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ట్రాఫిక్ నిబంధనల అమలును పరిశీలించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD