Vikarabad: వికారాబాద్ డైట్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
Vikarabad: వికారాబాద్ ప్రభుత్వ డైట్, ప్రైవేట్ డీఈడీ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు. జూలై 16 నుండి ప్రక్రియ ప్రారంభం. పూర్తి వివరాలు ఇవే.
Vikarabad: వికారాబాద్ డైట్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
వికారాబాద్: డైట్ లో స్పాట్ అడ్మిషన్లు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ డైట్ వికారాబాద్ కళాశాలలో మరియు ప్రైవేట్ డీఈడీ కళాశాలల్లో భర్తీ కాకుండా మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ల ద్వారా SCERT డైరెక్టర్ గారు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
వికారాబాద్ డైట్ ప్రిన్సిపాల్ .అబ్దుల్ ఘని. మంగళవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీసెట్-2026 లో క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎల్ఈడీ, కోర్సులలో నిబంధనల ప్రకారం అడ్మిషన్లు పొందవచ్చునని తెలిపారు. ఈనెల 16-07-2026 మరియు 17-07-2026 మధ్యాహ్నం సమయం 2 గంటలవరకు వికారాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో నిర్వహిస్తారు.
అలాగే ప్రైవేట్ డీఈడీ కళాశాలల్లో భర్తీ చేయుటకు 18-07-2026 నుండి 21-07-2026 మధ్యాహ్నం 2 గంటల వరకు సమయంవరకు ప్రైవేట్ డీఈడీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఖాళీల వివరాలు డీసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వివరాల కొరకు సంప్రదించవలసిన నంబర్ 7780740880.




