Pargi: పరిగిలో వీధి కుక్కల స్వైరవిహారం నలుగురు చిన్నారులపై దాడులు!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలోని తిరుమల రెసిడెన్సీ కాలనీలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ నలుగురు చిన్నారులపై దాడి చేశాయి. స్థానికుల తీవ్ర ఆందోళన.
Pargi: పరిగిలో వీధి కుక్కల స్వైరవిహారం నలుగురు చిన్నారులపై దాడులు!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.. చిన్నారులపై వరుసగా దాడులు చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి!పరిగిలోని తిరుమల రెసిడెన్సీ కాలనీలో వీధి కుక్కల దాడులతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. ఇళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలు, స్కూలుకు వెళ్లే చిన్నారులే లక్ష్యంగా కుక్కలు దాడులకు తెగబడుతున్నాయి.వరుసగా నలుగురు చిన్నారులపై దాడి జరగడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.ఓ చిన్నారి గొంతు పట్టుకునేలా కుక్క దాడి చేయగా, మరో చిన్నారి ముఖంపై దాడి చేయడంతో తీవ్ర రక్తగాయాలయ్యయి. గాయపడిన చిన్నారులకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.చిన్నారులు ఇంటి బయటకు వెళ్లాలన్నా.. స్కూలుకు వెళ్లాలన్నా తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లలు ఆడుకోవాల్సిన వీధుల్లోనే ప్రాణభయం వెంటాడుతోంది. ఏ క్షణంలో ఎక్కడి నుంచి కుక్కలు దాడి చేస్తాయోనని కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారుల్లో స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నలుగురు చిన్నారులపై దాడులు జరిగిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఇంకెన్ని సంఘటనలు జరగాలి? చిన్నారులకు గాయాలయ్యాకే అధికారులు మేల్కొంటారా?అంటూ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై లేదా? వీధి కుక్కల బెడదను నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? చిన్నారుల భద్రత కంటే ముఖ్యమైన పని ఇంకేముంది.
తిరుమల రెసిడెన్సీ కాలనీలో వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాడులకు పాల్పడుతున్న కుక్కలను పట్టుకుని, నిబంధనల ప్రకారం తగిన సంరక్షణ కేంద్రానికి తరలించాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చిన్నారులపై కుక్కల దాడులు జరుగుతున్నా అధికారులు ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తారు? మరో చిన్నారి గాయపడే వరకు వేచి చూస్తారా? ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, తిరుమల రెసిడెన్సీ కాలనీవాసులకు భరోసా కల్పిస్తారా? అనేది వేచి చూడాలి.




