Vikarabad: నాటు సారా తయారీ స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

Vikarabad: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొత్లాపూర్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాటు సారా స్థావరాలపై విసృ్తత దాడులు చేశారు.

Srikanth, Secunderabad
Published on: 2 Jun 2026 9:37 PM IST
Vikarabad
X

Vikarabad: నాటు సారా తయారీ స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

Vikarabad: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్లాపూర్ గ్రామంలో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాటు సారా తయారీ ముడి పదార్థాలను (ఐడీ లిక్కర్ రా మెటీరియల్) భారీగా స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన రాథోడ్ రత్న్యా నాయక్ (56) వద్ద నుండి రూ. 12,000 విలువైన 80 లీటర్ల ముడి పదార్థం, రూ. 5,250 విలువైన 15 కిలోల నవసాగరాన్ని (మొత్తం విలువ రూ. 17,250) టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు.

అదేవిధంగా, కొత్లాపూర్ గ్రామానికే చెందిన బాల్యా నాయక్ (38) నివాసంపై దాడి చేసి, అతని వద్ద నుండి రూ. 22,500 విలువైన 150 లీటర్ల ముడి పదార్థం, రూ. 350 విలువైన ఒక కిలో నవసాగరాన్ని (మొత్తం విలువ రూ. 22,850) స్వాధీనం చేసుకున్నారు. రెండు చోట్లా కలిపి మొత్తం రూ. 40,100 విలువైన సారా ముడి పదార్థాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొని స్వాదినం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన సామాగ్రిని, నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.కె. అన్వర్ పాషా తెలిపారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ మాట్లాడుతూ.. అక్రమ వ్యాపారాలు, నాటు సారా తయారు చేస్తే దాడులు కొనసాగుతామని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించడం జరిగింది.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story