Vikarabad: వికారాబాద్‌లో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్!

Vikarabad: వికారాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ పేకాట స్థావరాన్ని ఛేదించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 12 May 2026 7:14 AM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్!

Vikarabad: వికారాబాద్ జిల్లా ఎస్పీ *శ్రీమతి స్నేహ మెహ్ర, IPS* గారి ఆదేశాల మేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ *అన్వార్ పాషా* గారు తెలిపారు. ఈ క్రమంలో భాగంగా ఈ రోజు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు, వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలంపల్లి ప్రభుత్వ పాఠశాల (ZPHS) సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడి నిర్వహించింది.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ధరూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన గౌరప్ప, ఈ. గోపాల్, గంధం గోపాల్, కె. బాలయ్య, ఈ. హరీష్‌లతో పాటు మార్పల్లి మండలం కోటెమర్పల్లికి చెందిన ఎస్. వెంకట్ రెడ్డి మరియు వికారాబాద్‌కు చెందిన బి. శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

నిందితుల వద్ద నుండి మొత్తం *రూ. 26,355/-* నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌ కు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా గారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా గారు మాట్లాడుతూ.. "జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో ఎక్కడైనా పేకాట, ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, ఎక్కడైనా చట్టవిరుద్ధమైన పనులు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి" అని హెచ్చరించారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story