Vikarabad: వికారాబాద్‌లో మట్టి మాఫియా.. ఇండ్ల మధ్య నుండి టిప్పర్ల హల్‌చల్!
Vikarabad: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారం ఊరగుట్ట వద్ద జరుగుతున్న అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు, రవాణాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్.
Vikarabad: వికారాబాద్‌లో మట్టి మాఫియా.. ఇండ్ల మధ్య నుండి టిప్పర్ల హల్‌చల్!
Vikarabad: వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల ధన్నారం సర్వే నెం. 81 లోని ఊరగుట్ట వద్ద జరుగుతున్న అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు మరియు రవాణాను తక్షణమే నిలిపివేయవలసిందిగా వికారాబాద్ మండల MRO కు ఫిర్యాదు చేసిన రెండవ వార్డు ప్రజలు మా గ్రామంలోని ప్రభుత్వ భూమి అయిన ఊరగుట్ట సర్వే నెం. 81 వద్ద కొంతమంది అక్రమంగా ఎర్రమట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా గ్రామ మధ్యలోని ఇండ్ల మధ్య నుండి రవాణా చేస్తున్నారు.
దీనివల్ల గ్రామ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. దుమ్ము, ధూళితో కాలుష్యం పెరిగిపోయింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్డుపై నడవాలంటే టిప్పర్ల రాకపోకలతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు అని ఫిర్యాదు లో పేర్కొన్నారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఊరగుట్ట అనే ప్రకృతి వనరు కూడా నాశనమవుతోంది.
కావున, దయచేసి మీరు వెంటనే స్పందించి సదరు ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు మరియు రవాణాను పూర్తిగా నిలిపివేసి, ఊరగుట్టను, గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా 2వ వార్డు ధన్నారం గ్రామ ప్రజల తరపున ప్రార్థిస్తున్నాము అని తెలిపారు.




