Mominpet: ఫెన్సింగ్‌ వైర్లలో చిక్కుకున్న జింక రక్షించిన గ్రామస్తులు!

Mominpet: ఎంకేపల్లి గ్రామంలో వ్యవసాయ చేను ఫెన్సింగ్ వైర్లలో చిక్కుకున్న జింకను గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు కలిసి సురక్షితంగా రక్షించి తరలించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 5 July 2026 3:27 PM IST
Mominpet
X

Mominpet: ఫెన్సింగ్‌ వైర్లలో చిక్కుకున్న జింక రక్షించిన గ్రామస్తులు!

Mominpet: వికారాబాద్ జిల్లా , మోమిన్పేట్ మండలం , ఎంకేపల్లి గ్రామ పరిధిలోని ఓ వ్యవసాయ చేనుకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ వైర్లలో ఓ జింక కాలు చిక్కుకుని కదలలేని స్థితిలో ఉండిపోయింది.

దీనిని గమనించిన స్థానిక గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జాగ్రత్తగా జింకను ఫెన్సింగ్ వైర్ల నుంచి విడిపించి రక్షించారు.

అనంతరం జింకను చికిత్స మరియు తదుపరి సంరక్షణ కోసం అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story