Hyderabad: హై-స్పీడ్ రైలు కారిడార్లపై బీజేపీ నేత హర్షం!

Hyderabad: కేంద్రంగా రూ. 1.5 లక్షల కోట్ల బుల్లెట్ ట్రైన్ కారిడార్ల ప్రతిపాదనలపై ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు విష్ణువర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 19 July 2026 10:30 AM IST
Hyderabad
X

Hyderabad: హై-స్పీడ్ రైలు కారిడార్లపై బీజేపీ నేత హర్షం!

Hyderabad: హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని ప్రతిపాదిస్తున్న హై-స్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) కారిడార్లు దక్షిణ భారత అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయని బీజేపీ సీనియర్ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–పుణే–ముంబై హై-స్పీడ్ రైలు కారిడార్ల ప్రణాళికలు దేశ మౌలిక సదుపాయాల రంగంలో కీలక ముందడుగని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ, రాయలసీమకు ప్రాధాన్యం కల్పించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిని హై-స్పీడ్ రైలు కారిడార్‌తో అనుసంధానించే దిశగా వచ్చిన కొత్త ప్రతిపాదన అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతి నిలయానికి హై-స్పీడ్ రైలు అనుసంధానం కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకం, విద్య, వైద్య సేవలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

దేశంలో ఆధునిక రవాణా వ్యవస్థల అభివృద్ధికి దూరదృష్టితో కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల అమలుకు సహకరిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఈ హై-స్పీడ్ రైలు కారిడార్లు అమల్లోకి వస్తే మూడు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ప్రాంతీయ వాణిజ్యం, పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం, ఉపాధి అవకాశాలకు విశేష ఊతం లభిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. దేశాభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, వికసిత భారత్ లక్ష్య సాధనలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దాదాపు ఓక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పైబడ్డ ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమని ఆయన ఓక ప్రకటనలో తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story