Shabad: కాళీమాత ఆలయంలో గాయత్రి విశ్వకర్మ హోమం, పూజలు!

Shabad: షాబాద్ లక్ష్మీదేవి ఆలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. గాయత్రి విశ్వకర్మ హోమం, ప్రత్యేక పూజలు, పట్టణంలో భారీ ర్యాలీ, భక్తులకు విస్తృత అన్నదానం.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 17 Sept 2026 11:28 PM IST
Shabad
X

Shabad: కాళీమాత ఆలయంలో గాయత్రి విశ్వకర్మ హోమం, పూజలు!

షాబాద్: విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని షాబాద్ మండల కేంద్రంలోని లక్ష్మీదేవి (కాళీమాత) ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాన్‌కు ప్రత్యేక పూజలు, గాయత్రి విశ్వకర్మ హోమం నిర్వహించి భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

అనంతరం విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో షాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పూజలు, ర్యాలీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విశ్వకర్మ సమాజం ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు, సభ్యులు, యువత, భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA