Manneguda: సాగర్ హైవేపై వోల్వో కారులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రాణనష్టం!

Manneguda: రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని సాగర్ హైవేపై ఓవర్‌హీట్ కారణంగా వోల్వో కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 27 Nov 2026 2:55 PM IST
Manneguda
X

Manneguda: సాగర్ హైవేపై వోల్వో కారులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రాణనష్టం!

రంగారెడ్డి జిల్లా: మన్నెగూడ సమీపంలోని సాగర్ హైవేపై ఓ వోల్వో కారు ఓవర్‌హీట్ కారణంగా మంటలు అంటుకుని దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న నాచారానికి చెందిన రామకృష్ణ, ప్రవీణ్ మంటలను గమనించి వెంటనే అప్రమత్తమై కారు నుంచి బయటకు దిగారు. దీంతో ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

కారు నంబర్: TS 09 ES 8888 సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో సాగర్ హైవేపై కొద్దిసేపు కలకలం నెలకొంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM