Meerpet: మీర్‌పేట్ మంత్రాల చెరువు వద్ద ధర్నా.. వాకర్స్ తీవ్ర ఆగ్రహం!

Meerpet: మీర్‌పేట్ మంత్రాల చెరువు వద్ద తీవ్ర దుర్వాసన, పారిశుధ్య లోపాలపై వాకర్స్ ధర్నా.

RAHUL, MEERPET
Published on: 18 Jun 2026 11:34 AM IST
Meerpet
X

Meerpet: మీర్‌పేట్ మంత్రాల చెరువు వద్ద ధర్నా.. వాకర్స్ తీవ్ర ఆగ్రహం!

Meerpet: మంత్రాల చెరువు వద్ద నెలకొన్న దుర్వాసన, పారిశుధ్య సమస్యలు, భద్రతా లోపాలపై వాకర్స్ మరియు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. GHMC బడంగ్‌పేట్ సర్కిల్-16, 60వ డివిజన్ పరిధిలోని మంత్రాల చెరువు వద్ద చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వాకర్స్ ధర్నా నిర్వహించారు.

చెరువు చుట్టూ మార్నింగ్, ఈవెనింగ్ వాకింగ్ చేయడానికి తీవ్ర దుర్వాసన వస్తోందని, చనిపోయిన జంతువులను చెరువు సమీపంలో పడేయడం, చెత్త పేరుకుపోవడం, వీధి కుక్కలు మరియు పందులు సంచరిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళనకారులు తెలిపారు. ఇప్పటికే చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో పాటు డ్రైనేజీ నీరు కలవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొన్నారు.

చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 50 కాలనీల ప్రజలు ఈ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడానికి భయపడుతున్నారని తెలిపారు.

అదేవిధంగా, చెరువు వద్ద కొందరు గంజాయి సేవించడం, మద్యం తాగడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, అలాంటి వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చెరువు చుట్టూ ఉన్న చెత్త, కంపు మరియు కాలుష్యాన్ని అధికారులు వెంటనే తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు హెచ్చరించారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story