Nagole: ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలి: నాగోల్ సీఐ!
Nagole: నాగోల్‌లో బదిలీపై వెళ్లిన ఎస్‌ఐలు శివనాగ ప్రసాద్, రమేష్‌లకు ఘన వీడ్కోలు. ప్రజల మన్ననలు పొందేలా నిబద్ధతతో విధులు నిర్వహించాలని సీఐ సూచన.
Nagole: ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలి: నాగోల్ సీఐ!
నాగోల్: పోలీసు అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ సూచించారు. నాగోల్ పోలీస్ స్టేషన్ లో ఎస్‌ఐలుగా సుమారు రెండేళ్ల నాలుగు నెలల పాటు విధులు నిర్వహించి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయిన పి. శివనాగ ప్రసాద్, బి. రమేష్‌లకు గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పలు కేసుల దర్యాప్తులో చొరవ చూపడంతో పాటు ప్రజలకు భద్రత కల్పించడంలో ఇద్దరు ఎస్‌ఐలు నిబద్ధతతో సేవలందించారని అభినందించారు. కొత్త బాధ్యతల్లోనూ సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
బదిలీ అయిన ఎస్‌ఐలు మాట్లాడుతూ.. నాగోల్‌లో విధులు నిర్వహించిన సమయంలో సహకరించిన పోలీసు సిబ్బంది, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారిని శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.




