Hayathnagar: నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుద్ధ తాగునీటి ప్లాంట్!
Hayathnagar: అబ్దుల్లాపూర్‌మెట్ JNNURM కాలనీలో నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధ తాగునీటి ఫిల్టర్‌ను సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు.
Hayathnagar: నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుద్ధ తాగునీటి ప్లాంట్!
హయత్నగర్: మండల కేంద్రంలోని అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న JNNURM కాలనీలో నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్‌ను గురువారం ఉదయం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ హాజరై వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించారు. కాలనీ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అంతటి సుష్మా అశోక్ గౌడ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మాచగోని మహేందర్ ముదిరాజ్, తాటిపల్లి రమేష్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, జీవన్ రెడ్డి, తూర్పునూరి శివకుమార్ గౌడ్, బొడుసు రాఘవేందర్ యాదవ్, దీపిక నాగరాజ్, లింగాల శ్రీలత, మంజుల నరసింహ, బండి సునీత ఉపేందర్, దర్శనం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, నాంది ఫౌండేషన్ ప్రతినిధులు, సభ్యులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
కాలనీ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు నాంది ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.




