Shamshabad: శంషాబాద్‌లో విషాదం పశ్చిమ బెంగాల్ వ్యక్తి అనుమానాస్పద మృతి
Shamshabad: శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో తపోస్ (32) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Shamshabad: శంషాబాద్‌లో విషాదం పశ్చిమ బెంగాల్ వ్యక్తి అనుమానాస్పద మృతి
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో వ్యక్తి అనుమానాస్పద మృతి. ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్వాల్‌గూడలో, పార్క్ సమీపంలో తపోస్ (32) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు తపోస్ ఈ నెల 13న పశ్చిమ బెంగాల్ నుంచి పని కోసం నగరానికి వచ్చాడు. ప్రెస్టీజ్ సిటీలో పని చేయడానికి వచ్చినట్లు అతని స్నేహితులు తెలిపారు.
తపోస్‌కు ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగినట్లు సమాచారం. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పక్కనే ఉన్న కొండపై నుంచి పడి మృతి చెందాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story




