Chevella: మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు
Chevella: చేవెళ్ల మండలం గొల్లపల్లిలో ఘోర క్రూరత్వం. 50 ఏళ్ల మహిళ ఎరుకలి మైసమ్మను కాళ్లు నరికి, గొంతు కోసి గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
Chevella: మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి మైసమ్మ (50) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈర్లపల్లి రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మహిళ కాళ్లు నరికి, గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి మెడలో ఉన్న బంగారం, కాళ్లలో వెండి కడియాలు, చెవుల్లో ఉన్న ఆభరణాల కోసం హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
Next Story




