Medchal: అంబులెన్స్‌లోనే మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

Medchal: మూడు చింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామానికి చెందిన జానకిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌లోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది.

NAKSHATRAM, MEDCHAL
Published on: 21 Nov 2026 10:52 AM IST
Medchal
X

Medchal: అంబులెన్స్‌లోనే మగ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

Medchal: మూడు చింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామానికి చెందిన జానకికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకుని, జానకిని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఈఎంటీ శ్రీరామ్, పైలట్ తిరుపతి సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవానికి సహకరించడంతో తల్లీబిడ్డకు అవసరమైన సేవలు అందించారు.

అత్యవసర సమయంలో అందించిన సేవలకు జానకి కుటుంబ సభ్యులు 108 సిబ్బంది శ్రీరామ్, తిరుపతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL