LB Nagar: ఎల్బీనగర్‌లో దారుణం.. ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య!
LB Nagar: ఎల్బీనగర్‌లో దారుణం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చున్నీతో గొంతు నులిమి చంపిన భార్య.
LB Nagar: ఎల్బీనగర్‌లో దారుణం.. ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య!
LB Nagar: వివహేతర సంబంధానికి అడొస్తున్నాడని భర్త గొంతు నులిమి చంపిన ఓ మహిళ.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీ కరించేందుకు ప్రయత్నించింది. పోలీసులు అను మానంతో ఆమెను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ కథనం ప్రకారం.. మహబూబా బాద్ జిల్లా కొరవి మండలంలోని తట్టుపల్లి గ్రామానికి చెందిన బోడ నర్సింగ్(36) స్వరూప దంపతులు నగరంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉంటు న్నారు. వీరికి 10, 8 వయసున్న కుమార్తెలు న్నారు. పెద్ద కూతురు మహబూబాబాద్ లోనే ఉంటూ చదువుకుంటోంది. నర్సింగ్ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు.
బోడ స్వరూపకు తన భర్తను హత్యచేసి.. తన స్వగ్రామానికి చెందిన మోహన్ వివాహేతర సంబంధం ఉందని భర్తకు తెలియడంతో కొన్ని రోజులుగా వారి మధ్య తీవ్రంగా గొడవలు జరు గుతున్నాయి. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన స్వరూప అతన్ని అంతమొందించాలని పథకం వేసింది. ఈ నెల 20న మధ్యాహ్నం కుమార్తెను కొబ్బరి బొండాం తేవాలని బయటికి పంపింది. ఆపై భర్త ఛాతీపై కూర్చుని తెల్లని చున్నీతో గొంతుకు గట్టిగా బిగించి ఊపిరి ఆడకుండా చేసి దారు ణంగా హత్యచేసింది. అనంతరం చట్టం నుంచి తప్పించుకునేందుకు ఆ చున్నీని మంచానికి కట్టి ఆత్మహత్య చేసుకున్నాడని బుకాయించింది.
స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపు లోకి తీసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నివేది కను తెప్పించగా.. గొంతునులిమి హత్యచేసినట్లు స్పష్టంగా తెలిసింది. పోలీసులు తమదైన రీతిలో విచారించారు. హత్య జరిగిన వెంటనే తన ప్రియుడికి కాల్ చేసిన సెల్ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆమె తన నేరాన్ని పూర్తిగా అంగీకరించడంతో కేసును హత్యకేసుగా మార్చారు. ఆమెను సోమవారం రిమాండుకు తరలించారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయంపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.




