LB Nagar: వనస్థలిపురంలో 'గణేష్ సురక్షా సంకల్ప్-2026' అవగాహన!

LB Nagar: గణేష్ సురక్షా సంకల్ప్–2026 లో భాగంగా వనస్థలిపురంలో మహిళల భద్రతపై అవగాహన. డయల్-112, షీ టీమ్స్, సైబర్ నేరాలపై చైతన్యం కల్పించిన పోలీసులు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 21 Sept 2026 8:59 AM IST
LB Nagar
X

LB Nagar: వనస్థలిపురంలో 'గణేష్ సురక్షా సంకల్ప్-2026' అవగాహన!

LB Nagar: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గణేష్ సురక్షా సంకల్ప్–2026 కార్యక్రమంలో భాగంగా నిన్న వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాంఈతి హిల్స్ కాలనీ, వినాయక యూత్ అసోసియేషన్ గణేష్ మండపం మరియు సత్యనగర్ కాలనీ గణేష్ మండపాల వద్ద మహిళల భద్రత (Women Safety) అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో వనస్థలిపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) శ్రీ రవి బాబు, సెక్టార్ ఎస్‌ఐలు డి. నాగరాజు, డి. మల్లయ్య, షీ టీమ్ ఎస్‌ఐ శ్రీనివాస్, బీట్ అధికారులు మరియు సహచరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మహిళలు, యువతులు, భక్తులు మరియు చిన్నారులకు మహిళల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవల వినియోగం, షీ టీమ్స్ సేవలు, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు, సోషల్ మీడియా భద్రత మరియు మహిళలపై జరిగే వేధింపులను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.

మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, మహిళలు మరియు గణేష్ మండప నిర్వాహకులు మంచి స్పందన తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR