Tandur: జువెలరీ షాప్‌లో మహిళల చేతివాటం!
Tandur: తాండూరులోని జువెలరీ షాప్‌లో ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తి యజమానిని బురిడీ కొట్టించి 10 గ్రాముల బంగారు నెక్లెస్ దొంగిలించారు.
Tandur: జువెలరీ షాప్‌లో మహిళల చేతివాటం!
Tandur: కి'లేడీ'ల చేతివాటం
దర్జాగా నెక్లెస్ దొంగతనం
జువెలరీ షాప్ యజమాని బురిడీ కొట్టించిన వైనం
తాండూరు పట్టణ కేంద్రంలో జువెలరీ షాప్ యజమానిని బురిడీ కొట్టించి బంగారు నెక్లెస్ అపహరించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం...
తాండూరు పట్టణం గాంధీ చౌక్ సమీపంలోని గంజిపల్లి సాయి జ్యువెలరీ షాప్ లో బంగారం కొనేందుకు వచ్చిన ముగ్గురు మహిళలు ఒక వ్యక్తి జువెలరీ షాప్ యజమానిని ఏమార్చి 10 గ్రాముల బంగారు నెక్లెస్ దొంగిలించుకుపోయారు. యజమాని తేరుకొని చూసేసరికి అక్కడ వారు కనిపించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ రికార్డులు పరిశీలించి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరమేశ్వర్ తెలిపారు.
Next Story




