Hyderabad: పార్టీ బలోపేతానికి నేతలంతా సమిష్టిగా పనిచేయాలి: మంత్రి జూపల్లి!

Hyderabad: బేగంపేట టూరిజం ప్లాజాలో ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 23 Nov 2026 9:01 PM IST
Hyderabad
X

Hyderabad: పార్టీ బలోపేతానికి నేతలంతా సమిష్టిగా పనిచేయాలి: మంత్రి జూపల్లి!

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా నేతలతో చర్చిస్తూ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజల్లో పార్టీపై విశ్వాసం పెంపొందించడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.

నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలోనూ నాయకులంతా సమిష్టిగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. పదవులు ఆశిస్తున్న నాయకుల పేర్లతో జాబితాను ఏకాభిప్రాయంతో రూపొందించాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు కల్పించే విషయంలో ఐక్యంగా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

### ప్రజలకు చేరువగా ఉంటూ పార్టీ లక్ష్యాలను సాధించాలి

పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని జూపల్లి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, పార్టీకి–ప్రభుత్వానికి మధ్య సమన్వయంతో ప్రజలకు మరింత చేరువ కావాలని అన్నారు. వ్యక్తిగత అంశాల కంటే పార్టీ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం, సంస్థాగత లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకులు, కార్యకర్తల సేవలను అధిష్ఠానం గుర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఓర్పు, సహనం, అంకితభావంతో పనిచేసే వారికి తగిన సమయంలో అవకాశాలు, గుర్తింపు లభిస్తాయని భరోసా ఇచ్చారు. నాయకులంతా పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వెడ్మ బొజ్జు, నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, దండే విఠల్, నారాయణరావు పాటిల్, విఠల్ రెడ్డి, సోయం బాపురావు, ఆత్రం సక్కు, విశ్వప్రసాద్, శ్రీహరి రావు, శ్యామ్ నాయక్, కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.