Dundigal: దుండిగల్‌లో పచ్చని సందడి.. మొక్కలు నాటిన డిప్యూటీ కమిషనర్!

Dundigal: కుత్బుల్లాపూర్, దుండిగల్ సర్కిల్‌లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మొక్కలు నాటిన డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వెంకట మణి కరణ్.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 6 Jun 2026 12:45 PM IST
Dundigal
X

Dundigal: దుండిగల్‌లో పచ్చని సందడి.. మొక్కలు నాటిన డిప్యూటీ కమిషనర్!

Dundigal: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్క రించుకుని కుత్బుల్లాపూర్, దుండిగల్ సర్కిల్ పరిధిలోని నర్సరీలో శుక్రవారం మొక్కల నాటడం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకట మణి కరణ్ పాల్గొని మొక్కలు నాటి పర్యా వరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు

స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకం, సంర క్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు మనకు ప్రాణవాయువును అందించడమే కాకుండా వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా కా లుష్యాన్ని నియంత్రించడంతో పాటు జీవవై విధ్యాన్ని కూడా పరిరక్షించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగం డిప్యూటీ ఇంజనీర్ అన్వేష్ రెడ్డి, అసి స్టెంట్ ఇంజనీర్ అశోక్ కుమార్, యూబీడీ రఘువీర్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సాత్విక్ తదితరులు, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story