Hyderabad: హైదరాబాద్ జూపార్క్‌లో వైభవంగా 'ప్రపంచ సింహాల దినోత్సవం'!

Hyderabad: నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రపంచ సింహాల దినోత్సవం ఘనంగా జరిగింది. జంతు సంరక్షకుల టాక్ షోలు, సింహాల అలవాట్లు, ఆహారం, వైద్యంపై పర్యాటకులకు అవగాహన కల్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Aug 2026 7:29 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ జూపార్క్‌లో వైభవంగా 'ప్రపంచ సింహాల దినోత్సవం'!

హైదరాబాద్: ఈ రోజు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా జంతు సంరక్షకుల టాక్ షోలను నిర్వహించారు. ఇందులో భాగంగా జంతు సంరక్షకులు తాము రోజువారీ చేసే పనులు, సింహాల ప్రవర్తన, ప్రతిరోజూ అందించే ఆహార పట్టిక, టీకాల తదితర కార్యక్రమాల గురించి వివరించారు.

​ఈ సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ శ్రీ జె. మురళీధర్ మాట్లాడుతూ... ప్రతి పర్యావరణ దినోత్సవం నాడు వన్యప్రాణి విద్య మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. ఈ రోజు ప్రపంచ సింహాల దినోత్సవ వేడుకల సందర్భంగా, ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని దీనిని విజయవంతం చేసినందుకు పాల్గొన్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

​నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్‌లోని సంబంధిత ఎన్‌క్లోజర్లలో ఆసియా మరియు ఆఫ్రికన్ సింహాలు రెండింటినీ సంరక్షిస్తున్నారు. జూలో సఫారీ నీమొదటగా 1974 సంవత్సరంలో నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోనే ప్రారంభించారు. ఆ సమయంలోనే మొదటి లైన్ సఫారీ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ సఫారీ మొత్తం వైశాల్యం 45 ఎకరాలు. ప్రతిరోజూ ఉదయం సింహాల గుంపును సఫారీలోకి వదులుతారు. ఇక్కడ జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తుంటే సందర్శకులు వాహనాల నుండి వీక్షిస్తారు. ఇది సందర్శకులకు ఒక రోమాంచకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ కార్యక్రమంలో అధికారులు,జూ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story