Miyapur: దోమల నివారణపై మియాపూర్‌లో జీహెచ్‌ఎంసీ అవగాహన సదస్సు!

Miyapur: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జీహెచ్‌ఎంసీ మియాపూర్ సర్కిల్-48లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 20 Aug 2026 5:22 PM IST
Miyapur
X

Miyapur: దోమల నివారణపై మియాపూర్‌లో జీహెచ్‌ఎంసీ అవగాహన సదస్సు!

మియాపూర్: మియాపూర్ సర్కిల్-48: ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రోజున మియాపూర్ సర్కిల్-48 పరిధిలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (DC), అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (AMOH) తో పాటు ఎంటమాలజీ విభాగ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల ముందు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story