Hyderabad: హైదరాబాద్‌లో ‘వరల్డ్ మిఠాయి నంకీన్ కన్వెన్షన్’.. పోస్టర్ ఆవిష్కరణ!

Hyderabad: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో వరల్డ్ మిఠాయి నంకీన్ కన్వెన్షన్ (WMNC) పోస్టర్‌ను ఆవిష్కరించారు.

RAJESH,	WEST ZONE
Published on: 8 July 2026 12:23 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో ‘వరల్డ్ మిఠాయి నంకీన్ కన్వెన్షన్’.. పోస్టర్ ఆవిష్కరణ!

Hyderabad: దేశంలోని రూ.1.5 లక్షల కోట్ల విలువైన మిఠాయి- నంకీన్ పరిశ్రమకు చెందిన అతిపెద్ద వ్యాపారాల్లో ఒక్కటైన వరల్డ్ మిఠాయి నంకీన్ కన్వెన్షన్ (డబ్ల్యూఎంఎన్సీ) పర్చేజింగ్ ను ఈ నెల 16 నుంచి 18 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుంది. ఈ కన్వెన్షన్కు సంబంధించిన పోస్టర్ ను బంజారాహిల్స్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నంకీన్ మ్యానఫ్యాక్చరర్స్ డైరెక్టర్ జనరల్ ఫిరోజ్ దీనిని ఆవిష్కరించి మాట్లాడారు. పండుగల సీజన్ కు ముందు దేశవ్యాప్తంగా తయారీదారులు, సరఫరాదారులు, రిటైలర్లను ఒకే వేదిక పైకి తీసుకురావడమే ఈ కన్వెన్షన్ లక్ష్యమని తెలిపారు.

'పర్పెక్ట్ స్టార్ట్ టుది ఫెస్టివ్ సీజన్' అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్లో దేశవ్యాప్తంగా మిఠాయి, నంకీన్, బేకరీ, స్నాక్స్ రంగాలకు చెందిన తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, టెక్నాలజీ సంస్థలు, రిటైలర్లు పాల్గొననున్నట్లు వివరించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story