Hyderabad: అడ్డదారిలో వెళ్తున్నారా? ఇకపై జరిమానా మాత్రమే కాదు.. క్రిమినల్ కేసులే!
Hyderabad: హైదరాబాద్‌లో రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై పోలీసుల కఠిన చర్యలు.
Hyderabad: అడ్డదారిలో వెళ్తున్నారా? ఇకపై జరిమానా మాత్రమే కాదు.. క్రిమినల్ కేసులే!
Hyderabad: కాస్త దూరమేగా.. చుట్టూ తిరిగేంవెళ్తాం.. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా.. అడ్డదారిలో వెళ్లాం అని బండి నడిపారో కెమెరా కంటికి చిక్కినట్టే. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినట్లు క్షణాల్లో ఈ-చలానా సందేశం ఫోను వస్తుంది. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తిస్తే క్రిమినల్ కేసు నమోదుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాజధానిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు ట్రాఫిక్ విభాగం సిద్ధమైంది. నగరవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వాహనదారులు అడ్డదారిలో రాకపోకలు సాగిస్తున్నట్టు గుర్తించారు. వీటిలో ప్రధానమైన కొన్ని మార్గాల్లో ఆధునిక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జరిమానా విధిస్తున్నారు.
ఎదురుగా వాహనాలు వేగంగా దూసుకొస్తున్నా అడ్డదారిలో ప్రయాణిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది 5 నెలల్లో 50కి పైగా ప్రమాదాలు ఈకారణంగానే జరిగినట్టు దర్యాప్తులో గుర్తించారు. కుటుంబానికి ఆధారమైన ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఉదయం, రాత్రి వేళల్లో రోడ్లు ఖాళీగా ఉన్నాయని, ట్రాఫిక్ పోలీసులు గమనించరనే ఉద్దేశంతో ఇష్టానుసారం ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టు బడినపుడు చుట్టూ తిరిగిరావటం ఇబ్బందని, కొద్ది దూరమనే వచ్చామంటూ సమాధానమిస్తున్నారు.
మరికొందరు మాయమాటలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఓ పోలీసు అధికారి తెలి పారు. అడ్డదారిలో వచ్చి పోలీసులతో గొడవ పడుతూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నట్టు ప్రతి నెలా200 మందిపై కేసులు నమోదవుతుంటే వీరిలో 100 మంది రాంగ్ సైడ్లో వచ్చిన వాహనదారులే కావటం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇప్పుడే ఏమి చేస్తున్నారంటే
ఎలాగైనా వెంటనే గమ్యం చేరాలనే ఆలోచనతో అధికశాతం వాహనదారులు అడ్డదారిలో ప్రయాణిస్తున్నారు. మూలమలుప్పులు దూరంగా ఉన్నాయనే ఉద్దేశంతో కాలనీల్లోకి వెళ్లేందుకు రాంగ్ సైడ్ ఎంచుకుంటున్నారు. ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు నంబర్ట్ తొలగించటం, మార్పింగ్ చేస్తున్నారు. నెల వ్యవధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై 30 ప్రాంతాల్లోనే 2 లక్షలకు పైగా ర-చలానాలు నమోదు కావటం ఇందుకు నిదర్శనం.
నిత్యం రద్దీగా ఉండే కొన్ని ప్రాంతాల్లో అడ్డదారి ప్రయాణాలతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నట్టు గుర్తించారు.




