AS Rao Nagar: ఇంజెక్షన్లతో నొప్పులు తగ్గుతాయనే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని సూచన!
AS Rao Nagar: రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సతో మెరుగైన ఫలితాలు ఉంటాయని, అపోహలు నమ్మకుండా నిపుణుల సలహా తీసుకోవాలని యశోద హాస్పిటల్స్.
AS Rao Nagar: ఇంజెక్షన్లతో నొప్పులు తగ్గుతాయనే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని సూచన!
AS Rao Nagar: మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చిందని యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌కు చెందిన సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ హెచ్. వినయ్ కుమార్ తెలిపారు. గురువారం ఏఎస్ రావు నగర్లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమం, మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేవలం ఇంజెక్షన్లతోనే మోకాళ్ల నొప్పులను శాశ్వతంగా నయం చేయవచ్చనే ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, శాస్త్రీయ ఆధారాలు లేని చికిత్సలు, తప్పుడు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోకాళ్ల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.
యశోద హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న రోబోటిక్ సహాయక మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ద్వారా మరింత ఖచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ విధానం ద్వారా రోగుల అవసరాలకు అనుగుణంగా శస్త్రచికిత్స చేయడంతో పాటు నొప్పి తగ్గడం, రక్తస్రావం తగ్గడం, త్వరగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. చాలామంది రోగులు శస్త్రచికిత్స అనంతరం రెండు రోజుల్లోనే నిలబడి నడవగలుగుతున్నారని పేర్కొన్నారు.
రోబోటిక్ శస్త్రచికిత్సతో కోలుకున్న ఉమా.. రెండో కాలికి కూడా ఆపరేషన్ చేయించుకుంటాఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 70 ఏళ్ల ఉమా తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. గత కొన్నేళ్లుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న తాను, ఏడు నెలల క్రితం డాక్టర్ హెచ్. వినయ్ కుమార్ ఆధ్వర్యంలో రోబోటిక్ సాంకేతికతతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ అనంతరం తన ఆరోగ్యంలో ఎంతో మెరుగుదల కనిపించిందని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా నడవగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో నిత్యజీవిత పనులు చేసుకోవడానికి ఇబ్బందులు పడిన తాను, ప్రస్తుతం చురుకుగా అన్ని పనులు చేసుకుంటున్నానని తెలిపారు. వైద్యులు అందించిన చికిత్స పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ, తన రెండో కాలికి కూడా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వయస్సు ఎక్కువగా ఉందని మోకాలి ఆపరేషన్‌కు భయపడాల్సిన అవసరం లేదని, సరైన వైద్యుల సలహాతో తగిన చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చని తన అనుభవం ద్వారా తెలిపారు.
అదేవిధంగా, ఆసుపత్రిలో అత్యాధునిక ఆక్సినియం (Oxinium) ఇంప్లాంట్లు, మెటల్-సిరామిక్ భాగాలను ఉపయోగిస్తున్నట్లు డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు. ఇవి మన్నిక, పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలతో పాటు హిప్, షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్, క్రీడాకారులకు స్పోర్ట్స్ ఇంజురీ చికిత్సలు, వివిధ డే-కేర్ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.దీర్ఘకాలంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించాలని ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగ ప్రతినిధి, సీనియర్ మార్కెటింగ్ ప్రతినిధి అనిమల్ల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.




