Hyderabad: హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌లో బ్రెకియల్ ప్లెక్సస్ వైద్య శిబిరం!

Hyderabad: హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌లో బ్రెకియల్ ప్లెక్సస్ నరాల సమస్యలపై ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం.

MADHU, KAMAREDDY
Published on: 28 May 2026 3:44 PM IST
Hyderabad
X

Hyderabad: హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌లో బ్రెకియల్ ప్లెక్సస్ వైద్య శిబిరం!

హైదరాబాద్‌: హైటెక్‌ సిటీలోని Yashoda Hospitals లో బ్రెకియల్ ప్లెక్సస్‌ నరాల సమస్యలపై ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు బ్రెకియల్ ప్లెక్సస్‌ గాయాల వల్ల చేతుల కదలికలు తగ్గిపోవడం, భుజం మరియు నరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయని తెలిపారు.

శిబిరంలో బాధితులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు మరియు ఫిజియోథెరపీ ద్వారా చికిత్స అందించనున్నట్లు వైద్యులు వెల్లడించారు. చిన్నపిల్లలు మరియు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ చికిత్సలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. రోగులు ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదిస్తే చేతుల పనితీరును మెరుగుపరచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచించారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY

Next Story