Yellampet: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు!

Yellampet: ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి రమేష్, వైస్ చైర్‌పర్సన్ రజిత తదితరులు పాల్గొన్నారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 15 Oct 2026 6:53 PM IST
Yellampet
X

Yellampet: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు!

ఎల్లంపేట్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, బతుకమ్మ పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకున్నారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళల సందడితో వేడుకల ప్రాంగణం కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి లావుడ్యా శ్రీదేవి రమేష్, వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి మేకల రజిత దేవేందర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL