Yellampet: రూ.24.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Yellampet: ఎల్లంపేటలో రూ.7.50 లక్షలతో డ్రైనేజీ, రూ.17 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ శంకుస్థాపన చేశారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 2 Sept 2026 5:39 PM IST
Yellampet
X

Yellampet: రూ.24.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఎల్లంపేట: 02-09-2026 తేదీన ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని 2వ వార్డు కాసింభాయ్ తండాలో ₹7.50 లక్షల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మరియు 7వ వార్డు రావల్కోల్ ప్రాంతంలో ₹17.00 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎల్లంపేట పురపాలక సంఘం చైర్‌పర్సన్ శ్రీమతి లావుడ్యా శ్రీదేవి రమేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి గారు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ A.E గారు, స్థానిక ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL