Moinabad: మొయినాబాద్‌లో విషాదం క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి!
Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లి క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ సలీముద్దీన్ అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
Moinabad: మొయినాబాద్‌లో విషాదం క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి!
Moinabad: మహమ్మద్ నిజాముద్దీన్ వయసు 58 సంవత్సరాలు బంజారాహిల్స్ నివాసి ఫిర్యాదు మేరకు ఈరోజు ఉదయం అతని కుమారుడు సలీముద్దీన్ వయస్సు 38 సంవత్సరాలు వృత్తి హోటల్ మేనేజర్ క్రికెట్ ఆడడానికి అతని స్నేహితులతో కలిసి ఎంకేపల్లి గ్రామ పరిధిలో గల మల్బూమ్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా మధ్యాహ్నం సమయంలో అతనికి హార్ట్ ఎటాక్ రావడం జరిగింది అతని స్నేహితులు చికిత్స నిమిత్తం వెంటనే భాస్కర్ హాస్పిటల్ తరలించగా అక్కడ డాక్టర్లు చెక్ చేసి అప్పటికి చనిపోయాడని నిర్ధారించారు ఇట్టి విషయం పైన మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




