Malkajgiri: ఒక్క పరీక్షను కూడా కేంద్రం సక్రమంగా నిర్వహించలేకపోవడం సిగ్గుచేటు

Malkajgiri: మల్కాజిగిరి చౌరస్తాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 22 July 2026 10:23 PM IST
Malkajgiri
X

Malkajgiri: ఒక్క పరీక్షను కూడా కేంద్రం సక్రమంగా నిర్వహించలేకపోవడం సిగ్గుచేటు

మల్కాజ్గిరి: ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మల్కాజిగిరి చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జీడి చరణ్జిత్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ నిరసనలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మకు అజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా బిజెపి పాలనలో జరిగిందని, ఒక్క పరీక్షను కూడా కేంద్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదని కోట్లాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు.ఇలాంటి వాటిని ప్రశ్నించే విద్యార్థులపై లాటించార్జ్ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.

ఇలాంటి వాటిని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ జాతీయ నాయకులను రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ లతో పాటు పలు నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రి రాజీనామా చేయాలన్నారు.

జాతీయ పార్టీ ఆదేశాలతో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్ పిట్టల శ్రీనివాస్,జీడి సంపత్ గౌడ్,జి ఎన్ వి సతీష్ కుమార్,వైనాల ప్రవీణ్ వినోద్ యాదవ్,రాందాస్ సంతోష్ ముదిరాజ్,కన్నెమల నాగరాజు, బ్రహ్మయ్య,సిరిగిరి రాజు, ధరన్,పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story