Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో విషాదం భవనం పై నుంచి దూకి యువకుడు మృతి!
Hyderabad: పాతబస్తీలోని ఐ.ఎస్.సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భవనం పై నుంచి దూకి యువకుడు మృతి చెందాడు. ఇది ఆత్మహత్య కాదని హత్య అని భార్య అనుమానం వ్యక్తం చేస్తోంది.
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో విషాదం భవనం పై నుంచి దూకి యువకుడు మృతి!
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ ఐ.ఎస్.సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తలాబ్‌కట్ట బ్రిడ్జి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల ఫెరోజ్ బిన్ సుల్తాన్ మద్యం మత్తులో ఓ ఇంట్లోకి వెళ్లి న్యూసెన్స్ చేశాడు.
దీంతో స్థానికులు అతడిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఆటోలో తీసుకెళ్తుండగా.. సంతోష్‌నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఓ ఇంటి నాలుగో అంతస్తులోకి ప్రవేశించాడు. అనంతరం భవనం పై నుంచి దూకి అక్కడికక్కడే మృతి చెందాడు.
మద్యం మత్తులోనే దూకినట్లు స్థానికులు చెబుతుండగా.. తన భర్తను ఎవరైనా హత్య చేసి ఉంటారని భార్య అనుమానం వ్యక్తం చేసింది. ఐ.ఎస్.సదన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




