Malkajgiri: ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద న్యూసెన్స్.. యువకుడికి జైలు!

Malkajgiri: నేరేడ్‌మెట్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద న్యూసెన్స్ సృష్టించిన యువకుడికి కోర్టు 8 రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది.

Bodike Manohar, Malkajgiri
Published on: 9 Sept 2026 11:36 PM IST
Malkajgiri
X

Malkajgiri: ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద న్యూసెన్స్.. యువకుడికి జైలు!

మల్కాజ్గిరి, సెప్టెంబరు 9: నేరేడ్‌మెట్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద న్యూసెన్స్‌ సృష్టిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యాదవబస్తీకి చెందిన మోత్కూరు మహేష్‌ (21) గత కొన్ని రోజులుగా కళాశాల పరిసరాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో మహేష్‌పై సీపీ యాక్ట్‌లోని 70(ఏ), 70(బి),70(సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం మేజిస్ట్రేట్‌ మహేష్‌కు ఎనిమిది రోజుల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా నేరేడ్‌మెట్‌ పోలీసులు మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా న్యూసెన్స్‌ సృష్టించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాలలు, విద్యాసంస్థల పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని తెలిపారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story