Hyderabad: వైఎస్ షర్మిలా కుమార్తె నిశ్చితార్థం ఘనం!
Hyderabad: హైదరాబాద్‌లో వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె అంజలి రెడ్డి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Hyderabad: వైఎస్ షర్మిలా కుమార్తె నిశ్చితార్థం ఘనం!
Hyderabad: రంగారెడ్డి జిల్లా కోత్వలగూడలోని ఆనంద్ కన్వెన్షన్‌లో వైఎస్ షర్మిలా రెడ్డి కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి నిశ్చితార్థ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నిశ్చితార్థ వేడుకలకు తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.




