Tandur: తాండూరు ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు
Tandur: తాండూరులో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. సంక్షేమ పథకాలపై ఆయన ప్రశంసలు.
Tandur: తాండూరు ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు
తాండూర్: సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా వెలుగు నింపిన దివంగత మహానేత డా వైయస్ రాజశేఖర్ రెడ్డి అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా తాండూరు పట్టణ అధ్యక్షులు రొయ్యల నాగరాజు అధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, తాండూరు లో ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాయకుడంటే గుర్తుకొచ్చేది వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలించి పేద, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికీ చిరునవ్వుని ఇచ్చిన నాయకుడు వైయస్ఆర్, రెండు రూపాయలకే కిలో బియ్యం, ఇల్లు లేని వారికి పక్కా ఇల్లులు కట్టించడం, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇచ్చే ఏర్పాటు, పేద విద్యార్థులకు స్కాలర్ సిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్, మరణాలు అరికట్టేవిధంగా అత్యవసర సేవలు 108,104 వంటి ఆరోగ్య శ్రీ సేవలు, ఇలాంటి ఎన్నో సేవలందించిన ఆ మహా నేతకు ఇవే మా ఘన నివాళులర్పిస్తున్నాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధారాసింగ్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ నర్సిములుతో పాటు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులు, పలువురు సీనియర్ నాయకులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.




