Hyderabad: గచ్చిబౌలి DLF ఫుడ్ స్ట్రీట్‌లో ఆక్రమణల తొలగింపు
Hyderabad: గచ్చిబౌలి DLF ఫుడ్ స్ట్రీట్‌లో ఆక్రమణలను తొలగించిన సెరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ మలెంపాటి. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లను క్లియర్ చేసిన అధికారులు.
Hyderabad: గచ్చిబౌలి DLF ఫుడ్ స్ట్రీట్‌లో ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్: గచ్చిబౌలి DLF ఫుడ్ స్ట్రీట్‌ను సెరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీ నారాయణ అమిత్ మలెంపాటి, IAS సందర్శించారు. జోనల్ కమిషనర్ స్వయంగా పరిస్థితిని పరిశీలించారు.
ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశారు. రోడ్లను ఆక్రమించిన నిర్మాణాలు, అడ్డంకులను తొలగించారు.
పాదచారులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఆక్రమణలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Next Story




