New Zealand Earthquake: న్యూజిలాండ్‌లోని కెర్మెడెక్ దీవుల వద్ద సముద్ర గర్భంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

New Zealand Earthquake: సముద్ర గర్భంలో అకస్మాత్తుగా కలిగిన అలజడి పసిఫిక్ తీరప్రాంత వాసులను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది.

Gagan kumar
Published on: 31 Aug 2026 7:46 AM IST
New Zealand Earthquake
X

New Zealand Earthquake: న్యూజిలాండ్‌లోని కెర్మెడెక్ దీవుల వద్ద సముద్ర గర్భంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

New Zealand Earthquake: సముద్ర గర్భంలో అకస్మాత్తుగా కలిగిన అలజడి పసిఫిక్ తీరప్రాంత వాసులను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. న్యూజిలాండ్ పరిధిలోని కెర్మెడెక్ దీవుల సమీపంలో ఆదివారం రాత్రి వేళ భూమి తీవ్రంగా కంపించింది. నిశ్శబ్దంగా ఉన్న రాత్రి వేళ ఒక్కసారిగా వచ్చిన ఈ భారీ ప్రకంపనలతో తీరప్రాంత ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.7గా నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. యూఎస్ జియోలాజికల్ సర్వే సమాచారం ప్రకారం, ఈ భూకంప కేంద్రం సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 35 నుండి 40 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. ప్రశాంత మహాసముద్రంలో తీవ్ర ప్రకంపనలు వచ్చినప్పటికీ, అధికారులు ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

కెర్మెడెక్ దీవుల ప్రాంతం పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్'పరిధిలోకి రావడంతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే, రాత్రి సమయంలో ఈ ప్రకంపనలు రావడంతో స్థానిక యంత్రాంగం తక్షణమే అప్రమత్తమై తీరప్రాంత పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story