Tokyo: జపాన్‌లో మళ్లీ శక్తివంతమైన భూకంపం వణికిపోయిన టోక్యో!

Tokyo: తూర్పు జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. టోక్యోతో పాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2026 11:50 AM IST
Tokyo
X

Tokyo: జపాన్‌లో మళ్లీ శక్తివంతమైన భూకంపం వణికిపోయిన టోక్యో!

Tokyo: జపాన్‌లో వరుస భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మరోసారి అక్కడ భూమి కంపించింది. తెల్లవారుజామున తూర్పు జపాన్‌లో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైంది.

రాజధాని టోక్యోలోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే, అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ కేంద్రంగా, భూమికి 70 నుంచి 78 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.

దీని తీవ్రతను జేఎంఏ 5.9గా నమోదు చేయగా, యూఎస్ జియోలాజికల్ సర్వే, జర్మన్ జీఎఫ్‌జడ్ సంస్థలు 5.8గా పేర్కొన్నాయి. భూకంప ప్రకంపనల ధాటికి భవనాలు బలంగా ఊగిపోయాయి. ఈ ఘటనలో ఇబరాకి, చిబా, సైతామా ప్రిఫెక్చర్‌లలో పలువురు గాయపడినట్లు తెలిసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story