Abu Dhabi: అబుదాబిలో ఘనంగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు!

Abu Dhabi: అబుదాబిలో ఘనంగా జరిగిన తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు. హాజరైన రాయబార కార్యాలయ అధికారులు, ప్రముఖులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Oct 2026 7:53 PM IST
Abu Dhabi
X

Abu Dhabi: అబుదాబిలో ఘనంగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు!

అబుదాబి: తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ (TFA) ఆధ్వర్యంలో అబుదాబిలోని ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులు గా ఎంబసీ ఆఫ్ ఇండియా కౌన్సలర్ సౌమ్య గుప్తా, డా. బాలాజీ రామస్వామి మరియు ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు బిజి థామస్ గారితో కలిసి పాల్గొన GWMC 60వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సెల్ కో కన్వీనర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్ గారు.

తెలంగాణ సంస్కృతిని చాటేలా మహిళలు అందమైన బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొని సంప్రదాయ నృత్యాలు చేశారు. ప్రముఖ కళాకారుడు డాక్టర్ కోకిల నాగరాజు నృత్య దర్శకత్వంలో వచ్చిన ప్రదర్శనలు, గాయకులు అంజలి పులింటి, సోనీ యాదర్ల, సోనీ పటేళ్ల ఆటపాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలు తెచ్చిన మహిళలకు, సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులకు నిర్వాహకులు ప్రత్యేక బహుమతులు అందజేశారు. తెలంగాణ సంస్కృతిని పరిరక్షించేందుకే గత పది సంవత్సరాలుగా ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు TFA అధికార ప్రతినిధి రాజా శ్రీనివాస రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో TFA ప్రతినిధులు శ్రీనివాస్, గంగారెడ్డి, వంశీ, అశోక్, జగదీశ్, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్