Boat Capsizes: అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 250 మంది గల్లంతు!
Boat Capsizes: అండమాన్ సముద్రంలో రోహింగ్యా శరణార్థుల పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 250 మంది గల్లంతయ్యారు.
Boat Capsizes: అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 250 మంది గల్లంతు!
Boat Capsizes: అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. మెరుగైన జీవితం కోసం వలస వెళ్తున్న రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో కూడిన ఓ పడవ సముద్రం మధ్యలో మునిగిపోయింది (Boat Capsizes). ఈ ప్రమాదంలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ప్రమాదానికి కారణాలు:
ఐక్యరాజ్యసమితి (UN) నివేదిక ప్రకారం.. ఈ పడవ ఏప్రిల్ 4న బంగ్లాదేశ్‌లోని టేక్‌నాఫ్ ప్రాంతం నుంచి మలేసియాకు బయల్దేరింది. సముద్రంలో బలమైన ఈదురుగాలులు, రాకాసి కెరటాల ఉద్ధృతికి తోడు, పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
బతుకు జీవుడా అంటూ వెళ్తుండగా..:
మయన్మార్ సైనిక చర్యల వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బంగ్లాదేశ్‌కు చేరిన రోహింగ్యాలకు, అక్కడ కూడా కనీస వసతులు కరువయ్యాయి. కాక్స్ బజార్‌లోని రద్దీ శరణార్థి శిబిరాల నుంచి బయటపడి, మలేసియాలో ఉపాధి పొందాలనే ఆశతో ప్రమాదకర సముద్ర ప్రయాణం చేస్తూ వీరు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. ఈ ఘటనపై అంతర్జాతీయ శరణార్థుల హైకమిషనర్ (UNHCR) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.




