Anne Carson: కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్

Anne Carson: ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల ప్రదానోత్సవాల్లో భాగంగా 2026 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతి కెనడియన్ రచయిత్రి..

G Krishna
Published on: 8 Oct 2026 5:33 PM IST
Anne Carson
X

Anne Carson: కెనడా రచయిత్రి ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్

Anne Carson: ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతుల ప్రదానోత్సవాల్లో భాగంగా 2026 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతి కెనడియన్ రచయిత్రి, కవయిత్రి ఆన్ కార్సన్ (Anne Carson)ను వరించింది. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లోని స్వీడిష్ అకాడమీ గురువారం ఈ పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ క్లాసికల్ శైలితో ఆధునిక రచనలను అనుసంధానిస్తూ, సమకాలీన సాహిత్యంలో వినూత్న రీతులకు శ్రీకారం చుట్టిన ఆమె ధైర్యవంతమైన , సృజనాత్మక రచనలకు గానూ ఈ అత్యున్నత గౌరవం లభించిందని స్వీడిష్ అకాడమీ తమ ప్రకటనలో కొనియాడింది.

క్లాసిక్స్ నుంచి ఆధునిక సాహిత్యం వైపు..

1950లో కెనడాలోని టోరంటోలో జన్మించిన ఆన్ కార్సన్, 1981లో 'ఓడి ఎట్ అమో ఎర్గో సమ్' (Odi et Amo Ergo Sum) అనే అంశంపై క్లాసిక్స్ విభాగంలో తన డాక్టోరల్ థీసిస్‌ను పూర్తి చేశారు. తన సుదీర్ఘ సాహిత్య ప్రయాణంలో కవిత్వం రాయడంతో పాటు, ప్రాచీన కావ్యాల అనువాదకురాలిగా, వివిధ విశ్వవిద్యాలయాలలో అధ్యాపకురాలిగా సేవలందించారు. కవిత్వం, వచనం, నాటకం, అనువాద ప్రక్రియలను సమ్మేళనం చేస్తూ ఆమె రాసిన అనేక రచనలు అంతర్జాతీయంగా విశేష ఆదరణ పొందాయి. సాహితీ రంగంలో ఆమె చేసిన అమూల్యమైన సేవలకు గానూ నోబెల్ పురస్కారం దక్కడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.