Captain Smit Machchhar: ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ అత్యున్నత పురస్కారం!
Captain Smit Machchhar: కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడిని తట్టుకుని 170 మంది ప్రాణాలు కాపాడిన ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ అత్యున్నత పురస్కారం అందజేసింది.
Captain Smit Machchhar: ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యూఏఈ అత్యున్నత పురస్కారం!
Captain Smit Machchhar: ఫ్లైదుబాయ్ (Flydubai) విమానం కూల్చివేత ప్రయత్నాన్ని వీరోచితంగా అడ్డుకుని 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం అత్యున్నత గౌరవంతో సత్కరించింది. ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారాన్ని ప్రకటించింది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున, దుబాయ్ యువరాజు మరియు యూఏఈ ఉప ప్రధాని హమ్దాన్ బిన్ మహమ్మద్ అల్ మక్తూమ్ ఈ అవార్డును కెప్టెన్ మచ్చర్‌కు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రమాద సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన ఫ్లైట్ సిబ్బందిని కూడా యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించింది.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ తీవ్ర ఉన్మాదంతో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు.
ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై, కంటిచూపు మసకబారినప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అమోఘమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. కో-పైలట్‌ను నిరోధించి, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి 170 మందికి పైగా ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారు.
కెప్టెన్ మచ్చర్ చాకచక్యానికి, ప్రాణాలకు తెగించి చేసిన సాహసానికి గానూ ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆ దేశ అత్యున్నత శౌర్య పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ను ఆయనకు ప్రకటించిన సంగతి తెలిసిందే.




